Kendriya Vidyalayas: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ ప్రారంభం! 1 y ago
కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11 వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్ధల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు మొదటి ప్రాధాన్యం కల్పిస్తారు.
అర్హత ఉన్న వారు తరగతులకు నిర్దేశించిన మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్ధులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్ధులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు. ఒకటో తరగతి ప్రవేశాలు ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా, రెండు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 21. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.